: కూకట్ పల్లి మెట్రో వద్ద భారీ అగ్ని ప్రమాదం


హైదరాబాదు కూకట్ పల్లిలో ఈ మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మెట్రో దుకాణం వెనుక ఉన్న ఓ గృహ సముదాయంలో ఈ ప్రమాదం జరిగింది. దగ్గర్లో ఉన్న కెమికల్ లాబ్ లో గ్యాస్ లీక్ కారణంగానే మంటలు వచ్చాయని తెలుస్తోంది.

ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగసిపడడంతో పక్కనే ఉన్న మరో గృహ సముదాయానికి కూడా  మంటలు వ్యాపించాయి. ప్రమాదం ధాటికి గృహ సముదాయం కూలిపోయే ప్రమాదం వుందని సమాచారం. మంటల కారణంగా సమీపంలో ఉన్న ఓ కారు పేలిపోవడంతో పెద్ద శబ్దం వచ్చింది. దాంతో బాంబు పేలిందనుకుని చుట్టు పక్కల వారు భయంతో పరుగులు తీశారు.

కాగా మంటల్లో 8 ద్విచక్ర వాహనాలు తగులబడ్డాయి. మరోవైపు, సమాచారం తెలుసుకున్న ఐదు అగ్నిమాపక యంత్రాల సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News