: 11న ఆటోలు బంద్
హైదరాబాదులో ట్రాఫిక్ చలాన్లు ఒకేసారి వెయ్యి రూపాయలకు పెంచడంపై పెను దుమారం రేగుతోంది. ట్రాఫిక్ కమిషనర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆటో సంఘాలు, పెంచిన చలాన్లకు వ్యతిరేకంగా 11 వ తేదీ అర్థరాత్రి నుంచి బంద్ చేపడుతున్నట్టు ప్రకటించారు. దీంతో, తమ డిమాండ్లు నెరవేర్చే వరకు జంట నగరాల్లో ఆటోల నిరవధిక బంద్ జరుగుతుందని ఆటో సంఘాల జేఏసీ చైర్మన్ అమానుల్లా ఖాన్ తెలిపారు.