: సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తే తీవ్ర పరిణామాలు: శ్రీనివాస్ గౌడ్


రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాకముందే ఉద్యోగుల్లో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. అటు సీమాంధ్రలో ఏపీఎన్జీవోలు, ఇటు తెలంగాణలో టీఎన్జీవోలు సమరానికి సై అంటున్నారు. ఉద్యమాన్ని జాతీయస్థాయికి తీసుకెళతామని, నిరవధిక సమ్మె చేస్తామని ఏపీఎన్జీవోలు అంటుండగా.. అందుకు టీఎన్జీవోలు స్పందించారు. తెలంగాణా గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అప్పుడు ఏం జరిగినా సీమాంధ్ర ఉద్యోగులదే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్ర ఉద్యోగులు తమను పథకం ప్రకారం రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News