: హైదరాబాద్ లో సందడి చేసిన ఆడీ స్పోర్ట్స్ కార్లు


హైదరాబాదులో ఆడీ స్పోర్ట్స్ కార్లు సందడి చేశాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద ఆడీ సంస్ధ నిర్వహించిన గోకార్టింగ్ ఆటలో ఆ సంస్ధకు చెందిన స్పోర్ట్స్ కార్లు పాల్గొన్నాయి. హైదరాబాద్ లో ఆడీ కార్ల గోకార్టింగ్ నిర్వహించడం ఇదే మొదటిసారి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆ సంస్థకు చెందిన పలు రకాల మోడల్ స్పోర్ట్స్ కార్లను ఈ సందర్భంగా ప్రదర్శించారు. జాతీయస్థాయిలో అనుభవజ్ఞులైన శిక్షకులను రప్పించి వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జంటనగరాల ఆడీ కార్ల వినియోగదారులు పాల్గొని ఆనందించారు.

  • Loading...

More Telugu News