: గూర్ఖా జనముక్తి మోర్చాకు మమతా బెనర్జీ అల్టిమేటం
గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం జీజేఎం చేపట్టిన బంద్ ను తక్షణం ఉపసంహరించుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని విభజించే ప్రశ్నేలేదని ఆమె స్పష్టం చేశారు. జీజేఎం తలపెట్టిన బంద్ ను తక్షణం విరమిస్తే తాము చర్చలకు సిద్ధమని ప్రకటించారు. 72 గంటల్లో బంద్ విరమించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మమత హెచ్చరించారు.