: తెలంగాణలో టీడీపీపై ఆత్మీయతాభిమానాలున్నాయి: యనమల
తెలుగుదేశం పార్టీ పట్ల తెలంగాణ ప్రజల్లో ఆత్మీయత, అభిమానాలు ఉన్నాయని ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. తెలంగాణ, సీమాంధ్రలో టీడీపీ గెలుస్తుందనే భయంతో కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్సీపీతో కలిసి దొడ్డి దారిన అధికారంలోకి రావాలనుకుంటోందని యనమల విమర్శించారు. వైఎస్సార్సీపీ బలమేంటో పంచాయతీ ఎన్నికల్లో తెలిసిపోయిందని, భవిష్యత్ లో ఆ పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోతుందని అన్నారు.