: సీఎంపై టి-నేతల తప్పుడు ప్రచారం: మంత్రి బాలరాజు


ముఖ్యమంత్రి మీద తెలంగాణ నేతల విమర్శలకు దీటుగా సీమాంధ్ర మంత్రులు స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి మీద తప్పుడు ఆరోపణలు సరికాదని, సీమాంధ్ర మంత్రులు.. తెలంగాణ మంత్రులకు హితవు పలుకుతున్నారు. సీఎం అధిష్ఠానానికి విధేయుడేనని, అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడలేదని, బాధ్యతాయుత ముఖ్యమంత్రిగా మాట్లాడారని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. జలాలు, విద్యుత్, ఉద్యోగాలు సమస్యలు కావా? అని బాలరాజు ప్రశ్నించారు. దేశంలో జలవివాదాలు ఎప్పటికప్పుడు చెలరేగుతున్నాయని, వాటిని చూస్తూ కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి వాస్తవాలు చెబితే ఆయనకు ప్రాంతీయవాదం అంటగట్టడం సరికాదని బాలరాజు హితవు పలికారు.

  • Loading...

More Telugu News