: వీళ్లా ముఖ్యమంత్రిని విమర్శించేది?: మంత్రి కొండ్రు మురళి
ముఖ్యమంత్రిపై తెలంగాణ కాంగ్రెస్ నేతల విమర్శలు అర్థరహితమని మంత్రి కొండ్రు మురళి కొట్టిపడేశారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి జలయజ్ఞం పేరిట ఎంత సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందేనని అన్నారు.2004 లో సీటు రాకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఎంపీ పొన్నం ప్రభాకర్ నోటికొచ్చినట్లు మాట్లాడతాడని, ఊసరవెల్లిలాంటి వ్యక్తని అన్నారు. ఇక, గుత్తా సుఖేందర్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి దేశంలోని సమస్యలేవీ పట్టించుకోకుండా, ముఖ్యమంత్రి మీద మాట్లాడడం విచిత్రంగా ఉందని అన్నారు. కేంద్ర మంత్రిగా స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని కొండ్రు మురళి ఆరోపించారు. కేసీఆర్ కు అంబేద్కర్ మీద గౌరవం కలగడం మంచిదేనన్న కొండ్రు.. గుజరాతీ, మరాఠీలవి ఒకే భాష, ఒకే సంస్కృతీ సంప్రదాయాలు కావన్న విషయం తెలియకపోవడం అతని మేధొసంపత్తిని తెలియజేస్తోందని ఎద్దేవా చేశారు.