: టీవీ నటి సరాఖాన్ వాహనం బోల్తా
టీవీ నటి సరాఖాన్ వాహనం ఈ తెల్లవారుజామున ముంబై నగరంలో ప్రమాదానికి గురైంది. సరా బర్త్ డే పార్టీలో పాల్గొని తిరిగి వస్తుండగా.. ఆమె ప్రయాణిస్తున్న వాహనం తెల్లవారుజామున వేగంగా వెళుతూ ఓషివర ప్రాంతంలో రోడ్ డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో సరాతో పాటు మరో ఐదుగురు ఉన్నట్లు సమాచారం. అయితే, ఎవరికైనా గాయాలైనట్లు సమాచారం లేదు. తాగి వాహనాన్ని వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పలు హిందీ సీరియళ్లలో సరాఖాన్ నటించింది.