: తెలంగాణ మంత్రులకో నీతి... సీమాంధ్ర మంత్రులకో నీతా?: టీజీ
తెలంగాణ మంత్రులకో నీతి.. సీమాంధ్ర మంత్రులకో నీతా? అని మంత్రి టీజీ వెంకటేష్ ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడితే తప్పు కానిది రాష్ట్రంలోని సమస్యలు ముఖ్యమంత్రి ప్రస్తావిస్తే కర్రీ పాయింట్ పెట్టుకొమ్మంటారా? అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మాట్లాడలేదని, నిజాలు చెబితే ఉలిక్కి పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రుల మనోభావాలని ముఖ్యమంత్రి వెల్లడించారని టీజీ తెలిపారు.