: తెలంగాణ బిల్లును అడ్డుకుని తీరతాం: లగడపాటి


విజయవాడలో విద్యార్థి జేఏసీ ర్యాలీలో పాల్గొన్న అనంతరం ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు. చట్టసభల్లో తెలంగాణ బిల్లును అడ్డుకుని తీరతామని స్పష్టం చేశారు. విభజన విషయంలో కేంద్రం మరింత ముందుకెళ్ళకుండా అడ్డుకుంటామని తెలిపారు. విభజనతో ప్రాజెక్టులు నిలిచిపోతాయని, రైతులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. అయితే, అన్ని పార్టీలు ఓకే చెప్పినందునే విడగొట్టారని లగడపాటి చెప్పారు. హైదరాబాదుపై అందరికీ హక్కుందన్నారు. కాగా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ, ఆయన కుటుంబం ఎక్కడి నుంచి వలస వచ్చిందో చెప్పాలన్నారు. కర్రీ పాయింట్లు, టిఫిన్ సెంటర్లు పెట్టుకుని హైదరాబాదులోనే ఉండమంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం కేసీఆర్ కు తగదన్నారు.

  • Loading...

More Telugu News