: జెడ్డాలో దావూద్ ఈద్ ప్రార్థనలు.. త్వరలోనే పాక్ కు
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కోసం భారత్ ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ, అతడు మాత్రం పాకిస్థాన్, సౌదీ అరేబియాల మధ్య చక్కర్లు కొడుతున్నాడు. ప్రస్తుతానికి అతడు పాకిస్థాన్ వెలుపల ఉన్నాడని, అయితే ఇది తాత్కాలికమేనని పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ప్రత్యేక దూత షహర్యార్ ఖాన్ తెలిపారు. దావూద్ సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్లాడని, శుక్రవారం ఈద్ ప్రార్థనలలో పాల్గొన్నాడని ఆయన చెప్పారు. దావూద్ జెడ్డాలో గురువారం నిఘా వర్గాల కంటపడ్డాడని ఆయన వెల్లడించారు. దావూద్ వచ్చే వారం పాకిస్థాన్ కు తిరిగి రావచ్చన్నారు.