: 'ఫేస్ బుక్' వేదికగా ట్రాఫిక్ ఫిర్యాదుల స్వీకరణ


హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులు నగర ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సామాజిక మీడియా 'ఫేస్ బుక్'ను వేదికగా చేసుకున్నారు. దీని ద్వారా ట్రాఫిక్ కు సంబందించిన ఫిర్యాదులను, ఇబ్బందులను ఎవరైనా తెలపవచ్చు. అలా వచ్చిన వాటిని పరిశీలించి ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కార్యాలయాలకు వెళ్లేవారు సమయానికి చేరుకోలేకపోవడానికి కొంత ట్రాఫిక్ కూడా కారణమవుతుంది. ఇక అవగాహన లోపం, తొందరపాటుతో చిన్న చిన్న ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

ఇలా ప్రతివాటిని ఈ ఫిర్యాదుల్లో పేర్కొంటే, పరిశీలిస్తామని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. అంతేకాదు, తమకు కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇవ్వొచ్చని ట్రాఫిక్ అధికారులు సెలవిచ్చారు. ఇప్పటికే ఫేస్ బుక్ లో వేల మంది అభిమానులు ఉన్న హైదరాబాదు ట్రాఫిక్ విభాగానికి విమర్శలు, అభినందనలు సమపాళ్ళలో వస్తున్నాయి.

  • Loading...

More Telugu News