: సోనియా అల్లుడు వాద్రాపై ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలు


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా లక్ష్యంగా ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 2008లో హర్యానాలోని గుర్గావ్ దగ్గర షికోపుర్ గ్రామంలో 3.53 ఎకరాల భూమిని దక్కించుకునేందుకు వాద్రా తప్పుడు పత్రాలు చూపినట్లు తాజాగా వెల్లడించారు. అప్పట్లో ఆ భూముల విలువ రూ.58 కోట్లు ఉందని చెప్పారు. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ, డీఎల్ఎఫ్ యూనివర్సల్ లిమిటెడ్ మధ్య 2011లో పరస్పరం లావాదేవీలు జరిగినట్లు పేర్కొన్నారు. అయితే, వాద్రా సోనియా అల్లుడు కావడంతో ప్రభుత్వం నుంచి మద్దతు ఉందని వ్యాఖ్యానించారు. గతంలో ఇదే వ్యవహారంపై కొన్ని నెలల కిందట మాట్లాడిన ఖేమ్కా దర్యాప్తు కమిటీని వేయాలని డిమాండు చేశారు. దాంతో, ఆయనపై ట్రాన్సఫర్ వేటు పడింది.

  • Loading...

More Telugu News