: స్నోడెన్ దేశభక్తుడేమీ కాదు: ఒబామా
అమెరికా రహస్య నిఘా వ్యవహారాల గుట్టు విప్పి రష్యా రాజధాని మాస్కోలో శరణార్థిగా ఉన్న ఎడ్వర్డ్ స్నోడెన్ దేశభక్తుడు కాదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. అతడు ప్రస్తుతం రాజద్రోహం కేసులను ఎదుర్కొంటున్నాడని చెప్పారు. ఒకవేళ తను చేసింది సరైనదేనని ఎడ్వర్డ్ స్నోడెన్ భావిస్తుంటే అతడు అమెరికాకు వచ్చి కోర్టు ముందు హాజరై వాదన వినిపించుకోవాలని సూచించారు.