: సీడబ్ల్యూసీ నిర్ణయం శిలాశాసనం.. కట్టుబడాల్సిందే: దిగ్విజయ్ సింగ్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికి నేతలంతా కట్టుబడి ఉండాలని, తమ పార్టీకి ఆ కమిటీదే అంతిమ నిర్ణయమని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదని తెలిపారు. అన్ని సమస్యలను ఆంటోనీ కమిటీ పరిష్కరిస్తుందని చెప్పారు. మంగళవారం నుంచి ఆంటోనీ కమిటీ అభిప్రాయాలను సేకరిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కాంగ్రెస్ పార్టీ విధేయుడని, ఆయనతో తాను మాట్లాడతానని అన్నారు.

  • Loading...

More Telugu News