: శ్రీకాకుళంలో 'ఇంటింటికీ సమైక్యం'
సమైక్యాంధ్ర ఉద్యమం కొత్తపుంతలు తొక్కుతోంది. రంజాన్ సందర్భంగా రెండు రోజుల విరామం తరువాత మొదలైన ఉద్యమం మరింత తీవ్రరూపం దాలుస్తోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లాలో పురపాలక సంఘం ఉద్యోగులు వినూత్న ప్రచారం చేపట్టారు. ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి, రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకుందాం కలసి రమ్మని స్థానికులను ఉద్యమంలోనికి ఆహ్వానించారు. ఏడు రోడ్ల కూడలిలో ప్రైవేటు మెడికల్ సిబ్బంది మానవహారం చేపట్టి నిరసన తెలపగా, ట్రాన్స్ పోర్టు వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు, దర్జీలు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.