: గతాన్ని తవ్వొద్దంటున్న జేపీ
లోక్ సత్తా పార్టీ ఆధ్వర్యంలో ఈ ఉదయం హైదరాబాదు జూబ్లీ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్ర విభజన అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణతో పాటు పలువురు మేధావులు, భిన్న రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. సమావేశాన్ని ఆరంభిస్తూ, జేపీ ప్రసంగించారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నేపథ్యంలో గతాన్ని తవ్వుతూ కూర్చోకుండా, తెలుగు ప్రజలకు నమ్మకం కల్పించాలని సూచించారు. సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయంటూ వారికి భవిష్యత్ పై భరోసా ఇవ్వాలని అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు, విభేదాలను దూరం చేయాలన్నదే ఈ సదస్సు నిర్వహణ వెనకున్న ముఖ్య ఉద్దేశమని జేపీ చెప్పుకొచ్చారు. విభజన అంశం ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తుదంటూ, అందరి ప్రయోజనాలను సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ఈ సమావేశంలో 26 అంశాలపై చర్చ చేపట్టాలని నిర్ణయించారు.