: తెలుగువాడి గుండె చప్పుడు సమైక్యమే అంటోంది: లగడపాటి
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి సమైక్య బాణీ వినిపించారు. రాష్ట్రంలోని ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు సమైక్యతనే కోరుకుంటోందని చెప్పుకొచ్చారు. ఆయన నేడు విజయవాడలో విద్యార్థి జేఏసీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తన ఓటు సమైక్యాంధ్రకే అని పునరుద్ఘాటించారు. ప్రతినేతా సమైక్యవాదానికి కట్టుబడి ఉంటేనే రాష్ట్రం ముక్కలవకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా ప్రకటన చేశారని లగడపాటి ఆవేదన వ్యక్తం చేశారు.