: భారత్ మాకు పెద్ద వాణిజ్య భాగస్వామి: అమెరికా రాయబారి


భారత్ తమకు పెద్ద వాణిజ్య భాగస్వామి అని అమెరికా రాయబారి నాన్సీ పావెల్ చెప్పారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధాలు మరింత వృద్ధి చెందడానికి అవకాశాలున్నాయని అన్నారు. పుదుచ్చేరికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. కేవలం పదేళ్ల కాలంలోనే.. భారత్ 25వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి నుంచి 13వ స్థానానికి ఎగబాకిందని ఆమె తెలిపారు. ఇరు దేశాల ఆర్థిక రంగ స్థాయి ప్రకారం మరింత వాణిజ్య బంధానికి, వ్యాపార అవకాశాలకు అవకాశం ఉందన్నారు.

  • Loading...

More Telugu News