: షాపింగ్ మాల్ లో ఎంట్రీ ఫీజా..?
అహ్మదాబాద్ లోని ఐదు పెద్ద షాపింగ్ మాల్స్ లో అది కూడా ఒకటి. పేరు హిమాలయ మాల్. శుక్రవారం ఈద్ పండుగ కావడంతో రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. దీంతో ఒక్కొక్కరి దగ్గర నుంచి 20 రూపాయలు ప్రవేశ రుసుముగా వసూలు చేశారు మాల్ నిర్వాహకులు. వచ్చిన వారు ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేస్తే ప్రవేశ రుసుమును తిరిగి ఇచ్చేశారు.
అయితే, కేవలం ముస్లింల వద్దే ఎంట్రీ ఫీజు వసూలు చేసి మిగతా వారిని మినహాయించారని, ఇది తమ పట్ల వివక్ష చూపడమేనని ఆ వర్గం వారు ఆరోపించారు. కానీ హిమాలయ షాపింగ్ మాల్ ఆపరేషన్స్ మేనేజర్ దీప భట్నాగర్ మాత్రం రద్దీ రోజులలో సందర్శకులను నియంత్రించేందుకు వీలుగా ఇలా ప్రవేశ రుసుమును వసూలు చేయడం గతంలోనూ ఉందని, రానున్న దీపావళి పండుగ రోజున కూడా దీనిని అమలు చేయనున్నామని చెప్పారు.