: క్యాన్సర్‌ నివారణకు కొత్త వైద్యం!


క్యాన్సర్‌ వ్యాధిని నివారించేందుకు కొత్తరకం వైద్య పరికరాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటివరకూ క్యాన్సర్‌ నివారణలో ఉపయోగించే వైద్య విధానాలు చెప్పుకోదగినంత సమర్థనీయంగా లేవని, తాము కనుగొన్న కొత్తరకం విధానంతో క్యాన్సర్‌ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చైనాలోని పెంకింగ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక కొత్తరకం పరికరాన్ని కనుగొన్నారు. ఈ పరికరం క్యాన్సర్‌ వ్యాధిని సమర్ధవంతంగా నియంత్రిస్తుందని చెబుతున్నారు. మన రక్తప్రసరణ వ్యవస్థలోని క్యాన్సర్‌ కణాలను త్వరగా గుర్తించి, వాటిని రక్తంనుండి సమర్ధవంతంగా వేరుచేసే 'మైక్రో ఫ్లూయిడిక్‌ చిప్‌'ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ చిప్‌తో క్యాన్సర్‌ నిర్థారణ పరీక్షలు, చికిత్సలో గణనీయమైన మార్పులు రానున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రక్తంలోని క్యాన్సర్‌ కణితుల్లో 90 శాతం మేర కణాలను గ్రహించే ఈ కొత్త వైద్య విధానంతో రోగి ఆరోగ్య పరిస్థితిని మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు బాగా ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు.

సాధారణంగా రక్తంలోని క్యాన్సర్‌ కణాలు రక్త ప్రవాహం ద్వారా శరీరమంతా తిరుగుతూ ఈ వ్యాధి వ్యాప్తికి కారణమవుతుంటాయి. రక్తంలోని ఈ క్యాన్సర్‌ కణాల సాంద్రతను బట్టి వ్యాధి తీవ్రత, రోగి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న పరికరాలు, వైద్య విధానాలు క్యాన్సర్‌ కణాలను నియంత్రించడంలోను, రోగి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడంలోని చెప్పుకోదగినంత సమర్ధవంతంగా లేవు. ఎందుకంటే రక్తంలోని తెల్ల రక్తకణాలు, ఇతర క్యాన్సర్‌ రహిత కణాలను కూడా ఇవి క్యాన్సర్‌ కణాలుగా భావిస్తున్నాయి. పైగా ఈ ప్రక్రియలు నిర్వహించడానికి ఎక్కువ సమయం కావాల్సి ఉంటుంది. తాము కొత్తగా కనుగొన్న ఈ పరికరంతో రక్తంలోనే జీవకణ పరీక్షలు (బయాప్సీ) చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News