: సీఎం వాస్తవాలే చెప్పారు: జయప్రకాశ్ రెడ్డి
రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వాస్తవాలే చెప్పారని ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విభజన వల్ల ఇరుప్రాంతాల్లో తలెత్తే సమస్యలపై వాస్తవాలనే వెల్లడించారని అన్నారు. సీఎం వ్యాఖ్యలు సీడబ్ల్యూసీ తీర్మానం సహా ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. సీఎం వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రక్రియ నిలిచిపోతుందని ఆరోపిస్తూ కొందరు రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.