: నిండు ప్రాణాన్ని విభజన మింగేసింది
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని జీర్ణించుకోలేని తెలుగు జాతి గుండెలు ఆగిపోతున్నాయి. కాకినాడ గంగనాపల్లిలో మారుతీ కాలనీకి చెందిన పెద్దిరెడ్డి శ్రీనివాస్(28) గత పది రోజులుగా ఉద్యమంలో పాల్గొని, ఉద్యమ తీరు తెన్నులను చూస్తూ తీవ్ర ఉద్వేగానికి లోనై గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో అతని కుటుంబం దిక్కులేనిదైపోయింది. తన భర్తను రాష్ట్ర విభజనే పొట్టనపెట్టుకుందని అతని భార్య రమాదేవి ఆరోపిస్తోంది.