: అనవసర రాద్ధాంతాలు చేయొద్దు: డీకే అరుణ


రాష్ట్ర విభజనపై అనవసర రాద్ధాంతాలు చేయొద్దంటున్నారు మంత్రి డీకే అరుణ. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతే తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని చెప్పారు. పార్టీ నేతలు ఎవరైనా సరే అధిష్ఠానం మాట జవదాటరాదని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న సాయంత్రం మీడియా సమావేశంలో సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లాడిన నేపథ్యంలో డీకే అరుణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

  • Loading...

More Telugu News