: సచిన్ హాఫ్ సెంచరీ
చెన్నయ్ టెస్టులో సచిన్ (58) అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. ఆసీస్ పేసర్ ప్యాటిన్సన్ ధాటికి 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సచిన్.. పుజరా (44)తో కలిసి మూడో వికెట్ కు 93 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నాడు. కాగా, డ్రింక్స్ విరామానికి భారత్ స్కోరు 135/3. ప్రస్తుతం క్రీజులో సచిన్ జతగా కోహ్లీ (17) ఉన్నాడు. భారత్ ఇన్నింగ్స్ లో పతనమైన మూడు వికెట్లు ప్యాటిన్సన్ చేజిక్కించుకున్నాడు.