: మైక్రోమ్యాక్స్ యజమానికి కస్టడీ
ప్రముఖ దేశవాళీ మొబైల్ తయారీదారు 'మైక్రోమ్యాక్స్' సహ వ్యవస్థాపకుడు, డైరక్టర్ రాజేశ్ అగర్వాల్ కు కస్టడీ విధించారు. అగర్వాల్ ఓ అక్రమ నిర్మాణానికి అనుమతుల కోసం అధికారికి లంచం ఇస్తూ దొరికిపోయిన సంగతి తెలసిందే. నిన్న ఢిల్లీలో ఈయనతోపాటు మరో ఆరుగురిని ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని వజీర్ పూర్ వద్ద ఓ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి అనుమతులు తెచ్చుకునేందుకు అగర్వాల్ ఓ అధికారికి రూ.30 లక్షలు ఇస్తుండగా సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆయనను నేడు కోర్టు ముందు ప్రవేశపెట్టగా ఏడురోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించారు.