: కిరణ్ వ్యాఖ్యలపై స్పందించిన దిగ్విజయ్
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిన్న సాయంత్రం మీడియా సాక్షిగా చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ఢిల్లీలో నేడు మీడియాతో మాట్లాడుతూ, సీఎం కిరణ్ ఏవైనా చెప్పుకోదలిస్తే ఆంటోనీ కమిటీకి విన్నవించుకోవాలని సూచించారు. ఆయన కొన్ని అంశాలే లేవనెత్తారని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. కమిటీ ముందు సీమాంధ్ర ప్రజలు తెలిపే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టీకరించారు.