: ట్విట్టర్ కు గుడ్ బై చెప్పనున్న పోప్ బెనడిక్ట్-16
పోప్ పదవికి ఈ నెల 28న వీడ్కోలు చెప్పనున్న పోప్ బెనడిక్ట్-16...సామాజిక వెబ్ సైట్ ట్విట్టర్ కు కూడా గుడ్ బై చెప్పనున్నారు. ఇప్పటి వరకు 150 కోట్ల మంది రోమన్ క్యాథలిక్కులు, పోప్ బెనడిక్ట్-16 ను ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారు. అయితే ఈ ట్విట్టర్ ఖాతా బెనడిక్ట్ వ్యక్తిగతమైనది కాదని ఆయన పోప్ హోదాలో ఈ అకౌంట్ ఓపెన్ చేశారని అధికారులు చెబుతున్నారు.
పదవి నుంచి వైదొలగటానికి ముందుగా ఆయన కేవలం మరో రెండు సార్లు ట్వీట్ చేయనున్నారు. 85 ఏళ్ల వయసులో అనారోగ్యంతో పోప్ పదవి నుంచి బెనడిక్ట్ -16 వైదొలుగుతున్న సంగతి తెలిసిందే. పోప్ గా వైదొలుగుతున్న సందర్భంగా ఫిబ్రవరి 28న వాటికన్ సిటీలో పోప్ బెనడిక్ట్-16 ప్రసంగించనున్నారు. తాజాగా పోప్ తన ట్విట్టర్ అకౌంట్ మూసివేయనుండటం ఆయన ఫాలోయర్స్.. నెటిజన్లను బాధిస్తోంది.