: రాష్ట్రానికి తలమానికం హైదరాబాదు: జేపీ
లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ రాష్ట్ర విభజన అంశంపై మీడియాతో మాట్లాడారు. హైదరాబాదు నగరం రాష్ట్రానికే తలమానికం అన్నారు. అందరూ కలిసి చర్చించుకుంటే రాజధాని సమస్యకు పరిష్కారం అసాధ్యమేమీ కాదన్నారు. అందరికీ న్యాయం జరిగేలా ప్రత్యామ్నాయం చూపాల్సిన బాధ్యత ఉందన్నారు. ముఖ్యంగా రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే వెనుకబడి ఉందని గుర్తు చేశారు. ఆ ప్రాంతంలోని యువత భవిష్యత్తుకు హామీ ఇవ్వాల్సి ఉందని స్పష్టం చేశారు. రాయలసీమలో ఒక మహానగరాన్ని అభివృద్ధి చేయకపోతే, సమస్య మళ్ళీ తలెత్తవచ్చని అన్నారు. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు లోక్ సత్తా పార్టీ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందని జేపీ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రేపు జూబ్లీహాలులో సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.