: దేశంలో తొలి 'ఈ-లైబ్రరీ' హర్యానాలో


దేశంలో తొలి'ఈ-లైబ్రరీ' హర్యానా రాష్ట్రంలోని సిర్సా జిల్లాలో ప్రారంభం కానుంది. ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మొదట సిర్సా జిల్లాలోని దనీ బరుచా గ్రామంలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. అదేరోజు అదే జిల్లాలో యాభై గ్రామాల్లో ఈ-లైబ్రరీలను రాజీవ్ గాంధీ సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాల నిధి కింద ఈ-లైబ్రరీల కోసం మొదటి దశలో కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలియజేశారు. దీనికింద కంప్యూటర్లు, స్టాఫ్ట్ వేర్, పుస్తకాలు, పత్రికలు ఇవ్వనున్నారన్నారు. దాంతో, గ్రామాల్లోని ప్రజలు చాలా తేలికగా కంప్యూటర్ల సాయంతో పుస్తకాలు చదవొచ్చన్నారు.

  • Loading...

More Telugu News