: హీరో ప్రభాస్ ఇంట్లో కత్తి విసిరేసిన దొంగ!


ఓ ఇంట్లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగ పారిపోయే క్రమంలో సినీ నటుడు ప్రభాస్ ఇంట కత్తిని విసిరేసి ఉడాయించాడు. ఈ ఘటన హైదరాబాదు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 42లో చోటు చేసుకుంది. ఇక్కడి మీనాక్షి కన్ స్ట్రక్షన్స్ ఛైర్మన్ శ్రీనివాస్ ఇంట్లో దొంగతనం చేసేందుకు గతరాత్రి ఓ దొంగ ఇంటి గోడ దూకాడు. శబ్దం కావడంతో ఇంట్లో ఉన్న కుక్కలు అరిచాయి. దీంతో సెక్యూరిటీ గార్డు వెంకటరమణ అనుమానంతో అటుగా వెళ్లాడు.

అప్పటికే వంటగది దగ్గర దాక్కున్న దొంగను చూసిన గార్డు చేతిలోని కర్రతో కొట్టాడు. దాంతో, దొంగ తనవద్ద కత్తితో గార్డును గాయపర్చాడు. వెంటనే గార్డు అరవడంతో భయంతో దొంగ పక్కనే ఉన్న ప్రభాస్ ఇంటి ప్రహరీలోకి కత్తిని విసిరేసి పారిపోయాడు. ఈ విషయాన్ని వెంకటరమణ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News