: కార్మికులతో గొంతు కలిపిన గంటా
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా నేడు విశాఖపట్నం వద్ద కోరమాండల్ పరిశ్రమలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉదయం నుంచే నిరసన ప్రదర్శన చేపట్టిన కార్మికులతో మంత్రి గంటా శ్రీనివాసరావు జత కలిశారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ఆ కార్మికులకు తన మద్దతు తెలిపారు. అనంతరం వారితో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ కూడా పాల్గొన్నారు.