: సీఎంగా పదవిలో కొనసాగే అర్హత కిరణ్ కు లేదు: గుత్తా


సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల ప్రజల మధ్య సామరస్యం నెలకొల్పాల్సిన ముఖ్యమంత్రి రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఒక ప్రాంత ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా మాట్లాడడం, సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని చెప్పడాన్ని ఖండించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల వల్ల అహింసా మార్గంలో నడుస్తున్న ఉద్యమాలు హింసాయుత మార్గంలోకి వెళ్లే అవకాశముందని అన్నారు. సమైక్యాంధ్రను సమర్థిస్తే పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి నాయకత్వం వహించాలని సీఎంకి గుత్తా సుచించారు.

  • Loading...

More Telugu News