: హ్యాకర్ల బారిన పడిన మైక్రోసాఫ్ట్


దిగ్గజ ఐటీ సంస్థలు ఒకొక్కటిగా హ్యాకింగ్ కు గురవుతున్నాయి. ఫేస్ బుక్, యాపిల్, ట్విట్టర్ సంస్థలు ఇప్పటికే హ్యాకర్ల బారిన పడగా, తాజాగా ఈ జాబితాలోకి మైక్రో సాఫ్ట్ సంస్థ కూడా చేరింది. అమెరికా శాన్ ఫ్రాన్సిస్ కోకు చెందిన ఈ సంస్థకు చెందిన మ్యాక్ బిజెనెస్ యూనిట్టులోని కొన్ని కంప్యూటర్లు హ్యాకింగ్ కు గురయినట్లు గుర్తించినట్లు ఆ సంస్థలో ఉద్యోగి ఒకరు తెలిపారు.

మైక్రో సాఫ్ట్ సంస్థపై సైబర్ దాడులకు పాల్పడ్డ వారి వివరాలు ఇంకా తెలియలేదు. తమ సంస్థలో హ్యాకింగుకు గురయినవి తక్కువ కంప్యూటర్లే అయినా..వాటి ద్వారా హ్యాకర్లు సంస్థ మెయిన్ నెట్ వర్క్ కి కూడా రాగలిగారు. సైబర్ దాడులకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆపిల్ సంస్థ తెలిపింది.

  • Loading...

More Telugu News