: రేణుక కొత్త తెలంగాణ వాదం
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కొత్త తెలంగాణ వాదాన్ని లేవదీశారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలను తెలంగాణతో కలపాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి కోరారు. ఓడరేవు లేకుండా తెలంగాణ అభివృద్ధి చెందదని, అందుకే ఆ మూడు జిల్లాలను తెలంగాణలో కలపాలని ఆమె సూచించారు. అలాగే భద్రాచలంపై రేగుతున్న వివాదంపై స్పందిస్తూ.. ఏం చేయాలో తమకు తెలుసని, అనవసరంగా తమను, తమ ప్రాంతాన్ని వివాదంలోకి లాగవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.