: మండేలా ఊపిరి తీసుకుంటున్నారు: మాజీ భార్య
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షడు, నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా కోలుకుంటున్నారని ఆయన మాజీ భార్య విన్నీ మండేలా మీడియాకు తెలిపారు. తీవ్ర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో రెండు నెలలుగా ప్రిటోరియా ఆస్పత్రిలో మండేలా చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన కోలుకున్నట్లుగా ఇంతవరకూ వైద్యులు ప్రకటించలేదు. కానీ, ఆయన మాజీ భార్య విన్నీ మాత్రం మండేలా స్వయంగా ఊపిరి తీసుకుంటున్నారని, సైగలు చేయగలుగుతున్నారని తెలిపారు. వైద్యులు గొప్ప చికిత్స అందిస్తున్నారని ప్రశంసించారు. మండేలా మరణించినట్లేనంటూ మీడియాలో వచ్చిన వార్తలు తమను బాధించాయని ఆమె అన్నారు.