: వరంగల్ జిల్లాలో కిరణ్ దిష్టిబొమ్మ దహనం
వరంగల్ జిల్లా నరసింహులపేట చౌరస్తాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నేతలు దహనం చేశారు. నిన్న మీడియా సమావేశంలో సీఎం మాట్లాడిన మాటలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్టున్నాయని వారు ఆరోపించారు. సమైక్యాంధ్రకు మద్దతు పలకడం అన్యాయమని, వెంటనే సీఎం పదవినుంచి ఆయనను తొలగించాలని డిమాండు చేశారు.