: లష్కరే తోయిబా ఆధ్వర్యంలో రంజాన్ ప్రార్ధనలు


పవిత్ర రంజాన్ సందర్భంగా లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ఆధ్వర్యంలో లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో ప్రత్యేక ప్రార్ధనలు జరిగాయి. ఈ ప్రార్ధనల్లో పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. హఫీజ్.. ట్విట్టర్ లో ఈ ఉదయం 'ఈద్' శుభాకాంక్షలు కూడా తెలిపాడు. కాగా, 26/11 ముంబయి దాడులకు ముఖ్య కారకుడు హఫీజే. అంతేగాక భారతదేశం మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదుల లిస్టులో అతని పేరు కూడా ఉంది. ఇతని తలపై అమెరికా భారీమొత్తంలో రివార్డు ప్రకటించినా, ఈ ఉగ్రవాద నాయకుడు పాక్ లో స్వేచ్ఛగా మసలడం గమనార్హం.

  • Loading...

More Telugu News