: ఫిక్సింగ్ ను నేరపూరిత ఘటనగానే చూడాలి: అమీర్
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐదేళ్ల పాటు క్రికెట్ నుంచి బహిష్కరణకు గురైన పాక్ క్రికెటర్ మహమ్మద్ అమీర్, భారత క్రికెటర్ ద్రవిడ్ సూచనను సమర్థించాడు. ఫిక్సింగ్ ను నేరపూరిత ఘటనగానే చూడాలని వ్యాఖ్యానించాడు. క్రికెట్లో ఫిక్సింగ్ ను నియంత్రించడానికి ఐసీసీ మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరాడు. మ్యాచ్ లు జరిగే ప్రాంతాలలో స్థానిక పోలీసులను సమన్వయం చేసుకోవాలని సూచించాడు. ఫిక్సింగ్ రాకెట్ లో పాత్రధారులకు జైలు శిక్ష ఉండాలని, ఆటగాళ్ల ఫోన్ కాల్స్ పై నిఘా ఉండాలని చెప్పాడు.