: నగర శివారులో ట్రావెల్స్ బస్సుకు మంటలు.. తప్పిన ముప్పు
ఎస్వీఆర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు హైదరాబాద్ శివారులో ఈ ఉదయం అగ్ని ప్రమాదానికి గురైంది. కాకినాడ నుంచి నగరానికి వస్తుండగా పెద్ద అంబర్ పేట సమీపానికి రాగానే బస్సులో గ్యాస్ లీకై మంటలు మొదలయ్యాయి. వెనుకనున్న వాహనదారులు గుర్తించి బస్సు డ్రైవర్ కు చెప్పడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందికి దించేశాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే బస్సు వెనుక భాగం కాలిపోయింది.