: పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి... 23 మంది మృతి


పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 23 మంది మృతి చెందగా 60 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఓ సీనియర్ పోలీసు అధికారి కూడా ఉన్నారు. ఓ పోలీస్ అధికారి అంత్య క్రియలు జరుగుతున్న ప్రదేశంలో ఈ దాడులు జరిగాయి. దీంతో అతని అంత్య క్రియలకు వచ్చిన వారు మృతులు, క్షతగాత్రులుగా మారారు. కాగా ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటన చేయలేదు.

  • Loading...

More Telugu News