: నిలకడగా ఆడుతున్న భారత్
చెన్నయ్ టెస్టులో భారత్ నిలకడగా ఆడుతోంది. ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన టీమిండియాను సచిన్ (38), పుజారా (33) ఆదుకున్నారు. ప్రస్తుతం టీ విరామానికి భారత్ స్కోరు 84/2. అంతకుముందు, లంచ్ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 12 పరుగులకే సెహ్వాగ్ (2), విజయ్ (10) వికెట్లను చేజార్చుకుంది. ఈ రెండు వికెట్లు యువ పేసర్ ప్యాటిన్సన్ ఖాతాలో చేరాయి. కాగా, ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 380 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే