: పాము రాకతో కీచకులు జంప్!


ఒడిశాలో విచిత్రం చోటు చేసుకుంది. సంబల్ పూర్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థిని ఓ పాము కారణంగా కీచకుల బారి నుంచి తప్పించుకున్న ఘటన ఆసక్తి కలిగించింది. తన మిత్రురాలిని కలిసి హాస్టల్ గదికి వస్తుండగా ఆమెను ఇద్దరు దుండగలు అటకాయించి సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్ళారు. అనంతరం ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించసాగారు. ఇక అత్యాచారానికి ఒడిగడుతుండగా.. సమీపంలోని పొదలోంచి ఓ విషసర్పం బుసలు కొడుతూ వారిమధ్యకు వచ్చింది. దీంతో, భయకంపితులైన ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెను వదిలేసి పరుగు లంకించుకున్నారు. జరిగిన సంఘటన పట్ల వణికిపోయిన ఆమె హాస్టల్ గదికి చేరుకుని వర్శిటీ అధికారులకు విషయం వివరించింది. దీంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంగతి యూనివర్శిటీలోని బాయ్స్ హాస్టల్ కి చేరింది. ఆగ్రహించిన విద్యార్థులు రాస్తారోకో చేపట్టి, నిందితులను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News