: ఆంటోనీ కమిటీ ప్రభుత్వ కమిటీ కాదు: గాలి ముద్దుకృష్ణమ


ఆంటోనీ కమిటీ కాంగ్రెస్ పార్టీకి చెందినదే తప్ప ప్రభుత్వ కమిటీ కాదని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలిపారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ ఆంటోనీ కమిటీకి చట్టబద్దత లేదని, ఆ కమిటీకి సమస్యలు చెప్పుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలే సీమాంధ్ర ప్రజలను మోసం చేసేందుకు కమిటీ నాటకానికి తెరతీశారని మండిపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ కంటే ఈ కమిటీ గొప్పదా? అని ఆయన ప్రశ్నించారు. నేతలు నిజాయతీగా ఉంటే ప్రజలు హర్షిస్తారని, పదవులు వీడి ప్రజాక్షేత్రంలోకి రాకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.

  • Loading...

More Telugu News