: మధ్యాహ్న భోజనం తిని చిన్నారులకు అస్వస్థత
ఇటీవల కాలంలో 'మధ్యాహ్న భోజనం' విద్యార్థుల పాలిట విషాహారంగా మారుతోంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెంలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 30 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో అధికారులు వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఘటనకు కారణాలు అన్వేషిస్తున్నారు.