: మరో మహా కుంభమేళా ప్రారంభం


భక్తుల పుణ్య స్నానాలకు వీలుగా మరో మహా కుంభమేళా ప్రారంభమైంది. కాకపోతే ఇది దక్షిణ భారత కుంభమేళా. కర్ణాటకలోని మైసూర్ సమీపంలో తిరుమకుడ్లు నర్సీపూర్ అనే గ్రామం వద్ద ఇది జరుగుతోంది. అలహాబాద్ లో గంగ, యమున, సరస్వతి నదులు కలిసి ప్రవహిస్తాయి. దానిని త్రివేణి సంగమ స్థలి అంటాం. అలానే నర్సీపూర్ వద్ద కూడా కావేరీ, కపిల, స్పటిక అనే మూడు నదులు కలిసి ప్రవహిస్తాయి. 

నేటి నుంచి మూడు రోజుల పాటు అంటే 25 వరకూ ఈ మహా కుంభ మేళా జరుగుతుంది. 1989లో తొలిసారిగా ఇక్కడ కుంభమేళాను ప్రారంభించారు. ఇది తొమ్మిదవదని.. దీనిని మహాకుంభమేళాగా పిలుస్తున్నామని సుత్తూరు మఠాధిపతి శివరాత్రి దేశికేంద్ర స్వామి చెప్పారు.

ఈ నెల 25న చాలా పర్వదినమని.. ఆ రోజు ఉదయం 5.53 నుంచి 7.39 గంటల వరకు, మధ్యాహ్నం 12.17 నుంచి 1.05 గంటల మధ్య స్నానం చేస్తే ఎంతో పుణ్యప్రదమని చెప్పారు. ఈ మూడు రోజుల మహా కుంభమేళాలో లక్షలాది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని భావిస్తున్నారు. మత, పీఠాధిపతులు కూడా హాజరవుతారు. 

  • Loading...

More Telugu News