: సోమవారానికి వాయిదాపడిన లోక్ సభ
రంజాన్, వారాంతపు దినాలను పురస్కరించుకుని లోక్ సభ సోమవారానికి వాయిదాపడింది. టీడీపీ ఎంపీల సమైక్యాంధ్ర నినాదాలతో ఈ ఉదయం నుంచి పలుమార్లు వాయిదా పడిన సభ మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభమైంది. నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పుల ఘటనపై మాట్లాడేందుకు ఆర్జేడీ నేత ప్రభునాథ్ సింగ్ ఉపక్రమించగానే, ఇతర సభ్యులు కొందరు తామూ మాట్లాడతామని ఆందోళన చేయడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ కరియముండా ప్రకటించారు.