: సచివాలయంలో సామూహిక భోజనాలు
సచివాలయంలో ప్రాంతీయ సామరస్యత వెల్లి విరిసింది. విభజన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠ వాతావరణానికి ఆటవిడుపునిస్తూ, సచివాలయంలో ఉద్యోగులు బోనాల ఉత్సవాలు జరుపుకున్నారు. ప్రాంతీయ తారతమ్యాలు లేకుండా సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు కలసిమెలసి అభినందనలు తెలుపుకుని, సామూహిక భోజనాలు చేశారు.