: గల్ఫ్ దేశాల్లో ఈరోజే 'ఈద్'
పవిత్ర రంజాన్ మాసం దాదాపు పూర్తవడంతో 'ఈద్ అల్ ఫితర్' ను గల్ఫ్ దేశాల ప్రజలు ఈరోజే జరుపుకున్నారు. బుధవారం సూర్యాస్తమయం అనంతరం చంద్రుడు కనిపించినట్లు కొంతమంది సాక్ష్యులు తెలపడంతో గురువారం ఈద్ ను జరుపుకోవచ్చని సౌది అరేబియాలోని రాయల్ కోర్టు ప్రకటించింది. అటు ఖతార్ లోని దేవాదాయ, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా అదే ప్రకటన చేయడంతో ఆ దేశాల్లోని ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.